Current Affairs Telugu Daily

 అత్యంత క్లిష్టమైన కూడలిని చైనాలోని చాంకింగ్‌ నగరంలో నిర్మించారు. 
రెండు, మూడు వరుసల రోడ్లు నాలుగు దిక్కులకు చీలిపోయే కూడలిలో ఏ దిక్కుకు పోవాలో తెలియక వాహనదారులు తికమక పడడం మనం చూస్తూనే ఉంటాం. మరి, 20 ర్యాంపులు (కిందకు దిగే రోడ్లు) కలిగిన ఐదు వరుసల రోడ్లు ఎనిమిది దిక్కులుగా చీలిపోయే సెంటర్‌ను చూస్తే కళ్లు తిరిగి గుడ్లు తేలేయడం ఖాయం. అలాంటి అత్యంత క్లిష్టమైన కూడలిని చైనాలోని చాంకింగ్‌ నగరంలో నిర్మించారు.  
2009లో చేపట్టిన ఈ భారి ప్రాజెక్టును మే 31వ తేదీన చైనా పూర్తి చేసింది. దీనిపై ట్రయల్‌ రన్‌ నిర్వహించినప్పటికీ దీన్ని ఇప్పడే ప్రారంభించడం లేదట. వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నట్లు చైనా అధికారులు తెలిపారు. నగరంలో ఓ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను పూర్తి చేయాల్సిన పని ఉందని, అది పూర్తయ్యాక దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సంక్లిష్ట రోడ్ల కూడలిపై చైనా సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

views: 895

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams