Current Affairs Telugu Daily

అబార్షన్‌ చట్టాల రద్దుకు ఐర్లాండ్‌ ప్రజల ఓటు
అబార్షన్‌ వ్యతిరేక చట్టాల రద్దునకు ఐర్లాండ్‌ ప్రజలు మొగ్గుచూపారు. 2018 మే 25న  నిర్వహించిన రిఫరెండంలో అబార్షన్‌ వ్యతిరేక కఠిన చట్టాల్ని రద్దు చేయాలని సుమారు 66.4 శాతం మంది ఓటేశారు. 33.6 శాతం మంది వ్యతిరేకించారు.
  • గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం సేకరించారు. ప్రజా తీర్పును ప్రధాని వారద్కర్‌ స్వాగతించారు.
  • ఆరేళ్ల క్రితం భారత సంతతి వివాహిత సవితా హాప్పనవర్‌(31) మృతితో ఐర్లాండ్‌లో అబార్షన్‌ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఉద్యమం ప్రారంభమైంది.

views: 883

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams