Current Affairs Telugu Daily

కారల్‌ మార్క్స్‌ దాస్‌ కాపిటల్‌లోని ఒక్క పేజీకి మూడున్నర కోట్లు
కారల్‌ మార్క్స్‌ ద్విశతాబ్ది జయంతుత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన రాసిన దాస్‌ కాపిటల్‌ రాత ప్రతి ఒకే ఒక్క పేజీ 5,23, 000 డాలర్లకు వేలంలో అమ్ముడంతో వార్తల్లోకెక్కింది.
  • 2018 మే 3న బీజింగ్‌లో మార్క్స్‌ రాసిన దాస్‌ కాపిటల్‌లోని ఒక పేజీ రాతప్రతిని వేలం వేయగా మూడున్నర కోట్లకు పైగా ధర పలికింది.
  • సెప్టెంబర్‌ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య కాలంలో లండన్‌లో దాస్‌ కాపిటల్‌ రాయడం కోసం ఆయన తయారుచేసుకున్న 1,250 పేజీల నోట్సులోనిదే ఈ పేజీ అని భావిస్తున్నారు.
  • చైనాకి చెందిన ఫెంగ్‌ లుంగ్‌ అనే వ్యాపారవేత్త బీజింగ్‌లో ఏర్పాటు చేసిన వేలం కార్యక్రమంలో 5,23,000 డాలర్లకు ఈ పేజీ అమ్ముడయ్యింది.
  • 3 లక్షల యువాన్‌తో ప్రారంభమైన ఈ వేలం ముగిసేసరికి 3.34 మిలియన్‌ యువాన్‌లు అంటే 5,23000 డాలర్లు పలికింది.

views: 1122

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams