Current Affairs Telugu Daily

జస్టిస్‌ పూంఛి సిఫార్సులపై సమాలోచనలు పూర్తి 
గత ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జస్టిస్‌ ఎంఎం పూంఛి కమిషన్‌ నివేదికపై చర్చలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
  • కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఆ కమిషన్‌ ఇచ్చిన మొత్తం 273 సిఫార్సులపై అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం సమాలోచనలు జరిపి ఆమోదముద్ర వేసే ప్రక్రియ 2018 మే 25తో ముగిసింది.
  • సర్కారియా కమిషన్‌ తర్వాత కేంద్ర, రాష్ట్ర సంబంధాల పునర్‌నిర్వచనం కోసం 2005లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌మోహన్‌ పూంఛి నేతృత్వంలో ఏర్పాటయిన కమిషన్‌ 2010లో 7 సంపుటాలల్లో నివేదిక ఇచ్చింది.
  • ఇందులోని 5 సంపుటాలపై ఇదివరకే చర్చులు పూర్తిచేసిన కేంద్ర హోంశాఖ తాజాగా మిగిలిన 2 సంపుటాలపై రాష్ట్రాతో మాడ్లాడి ఆమోదం తీసుకొంది.
  • కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం 13వ సమావేశంలో కేంద్రమంత్రులు, రాష్ట్రా ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొని మొత్తం 88 సిఫార్సులపై చర్చలు జరిపారు.
  • స్థాయీ సంఘంలో ఏడుగురు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండగా తాజా సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్‌ మాత్రమే హాజరయ్యారు.
  • ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌ నుంచి ముఖ్యమంత్రుల తరఫున రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. 

views: 837



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams