భవిష్యనిధి(PF) ఖాతాలపై 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.55% వడ్డీ రేటును అందజేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ఫీల్డ్ కార్యాలయాలను ఆదేశించింది.
8.55% వడ్డీ రేటుకు కేంద్ర ఆర్థికశాఖ ఇదివరకే అంగీకారం తెలిపినప్పటికీ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దీన్ని EPFO అమలు చేయలేకపోయింది.
2018 ఫిబ్రవరిలో జరిగిన EPFO కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ వడ్డీరేటును నిర్ణయించారు.
గత ఐదేళ్లలో EPFO అందించిన వడ్డీ రేట్లలో ఇదే అత్యల్పం.
EPFO-Employees' Provident Fund Organisation
views: 875