Current Affairs Telugu Daily

విశ్వాస పరీక్షలో కర్ణాటక సీఎం కుమారస్వామి విజయం
కర్ణాటక విధానసభలో 2018 మే 25న నిర్వహించిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి విజయం సాధించారు.
  • బలపరీక్షలకు ముందే విపక్ష బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌, జనతాదళ్‌ (ఎస్‌) సంకీర్ణ పాలన ప్రారంభానికి మార్గం సుగమమైంది.
  • విధానసభ సభాపతిగా శ్రీనివాసపురం ఎమ్మెల్యే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కె.ఆర్‌.రమేశ్‌కుమార్‌ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు.
  • చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థి సురేశ్‌కుమార్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో రమేశ్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.
  • 1994-99 మధ్య కూడా రమేశ్‌కుమార్‌ సభాపతిగా పని చేశారు.
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత - యడ్యూరప్ప (బీజేపీ)

views: 732

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams