Current Affairs Telugu Daily

భారత అగ్రగామి 20 మంది కుబేరులకు 17.85 బిలియన్‌ డాలర్ల నష్టం
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా భారత అగ్రగామి 20 మంది కుబేరులు 17.85 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.1.16 లక్షల కోట్లు) సంపదను పోగొట్టుకున్నారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ వెల్లడించింది.
  • అందులో తొలి అయిదు మందే 15 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.97,500 కోట్లు) మేర పోగొట్టుకున్నట్లు తెలిపింది. 
  • గౌతమ్‌ అదానీ అత్యధికంగా 3.68 బిలియన్‌ డాలర్లను పోగొట్టుకోవడంతో ఆయన నికర సంపద 6.75 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. బ్లూమ్‌బర్గ్‌ సూచీలో అదానీ 242 స్థానంలో ఉన్నారు.
  • విప్రోలో మెజారిటీ వాటా ఉన్న అజీమ్‌ ప్రేమ్‌జీ కూడా ఈ ఏడాదిలో భారీగానే(దాదాపు 3.5 బి.డాలర్లు) నష్టపోయారు. 
  • సన్‌ ఫార్మాసూటికల్స్‌ అధిపతి దిలీప్‌ సంఘ్వి కూడా ఈ ఏడాది 3.48 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకుని 9.34 బిలియన్‌ డాలర్లకు నికర సంపద పరిమితం చేసుకున్నారు.
  • ప్రపంచ కుబేరుల్లో సంఘ్వి 153వ స్థానంలో ఉన్నారు.
  • ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ నికర సంపద ఈ ఏడాది కొద్దిగానే తగ్గింది.
  • 2.83 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకుని 37.4 బిలియన్‌ డాలర్ల సంపదతో నిలిచారు. 
  • కుమార మంగళం బిర్లాకు చెందిన ఎనిమిది నమోదిత కంపెనీలు కలిసి 19.72 శాతం మేర నష్టపోవడంతో 2017 చివర్లో ఉన్న రూ.2,73,932 కోట్ల మార్కెట్‌ విలువ కాస్తా ఇపుడు రూ.2,19,904 కోట్లకు చేరుకుంది. 

views: 813

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams