Current Affairs Telugu Daily

మైకేల్‌ జాక్సన్‌ 45 డిగ్రీల వరకు వంగి చేసిన స్టెప్‌ రహస్యం వెల్లడి
పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌ 1987లో ‘స్మూత్‌ క్రిమినల్‌’ అనే పాటలో భూమికి 45 డిగ్రీ వరకు వంగి, తిరిగి యథాతథస్థితికి వచ్చేలా వేసిన స్టెప్‌ వెనుక రహస్యాన్ని చండీగఢ్‌లోని వైద్యవిద్య, పరిశోధన స్నాతకోత్తర సంస్థ(పీజీఐఎంఈఆర్‌)కు చెందిన ముగ్గురు నాడీశస్త్రచికిత్స నిపుణులు చేధించారు.
  • దీనివెనుక ఉన్న జీవయాంత్రికత(బయోమెకానిక్స్‌)పై నిశాంత్‌ ఎస్‌.యాగ్నిక్‌, మంజుల్‌ త్రిపాఠి, సందీప్‌ మొహింద్ర చేసిన పరిశోధన వివరాలు ‘న్యూరోసర్జరీ’ అనే జర్నల్‌లో 2018 మే 22న ప్రచురితమయ్యాయి.
  • వీరి పరిశోధనల ప్రకారం రెండు కారణాలవల్ల ఆ స్టెప్‌ సాధ్యమైంది.
  • మొదటిది ప్రత్యేకంగా తయారుచేసిన బూట్లు. వీటిపై జాక్సన్‌ పేటెంట్‌ హక్కు సైతం పొందారు.
  • అడుగుభాగాన భూమిని గట్టిగా పట్టి ఉంచడానికి ఓ రంధ్రంతో పాటు కిందినిర్మాణం కూడా విభిన్నంగా రూపొందించారు.
  • రెండోది జాక్సన్‌ స్నాయువు(టెండన్స్‌)ల్లో బలం. వెన్నెముకను నిటారుగా ఉంచి, ముందుకు వంగినప్పుడు తుంటికీలు(హిప్‌జాయింట్స్‌) కేంద్రీయ స్థానంగా పనిచేసింది.
  • వీపుపై ఉన్న కండరాలు, వెన్నెముకకు బలం చేకూర్చాయి. తద్వారా శరీరం కదలికలకు సాయపడ్డాయి.
  • ఫలితంగా జాక్సన్‌ ముందుకు పడలేదు. ముందుకు వంగినప్పుడు కేంద్రీయస్థానం చీలమండ కీళ్ల(యాంకిల్‌ జాయింట్స్‌)కు మారినప్పుడు, ‘ఎరెక్టర్‌ స్పేనే’ అనే వీపుపై ఉండే పెద్ద కండరం గురుత్వాకర్షణ బలాన్ని కోల్పోయింది.
  • ఫలితంగా మడమ కండర బంధనం(అకిలీస్‌ టెండన్‌)పై ఒత్తిడి కేంద్రీకృతమవడంతో జాక్సన్‌ పడిపోలేదు.
మైకేల్‌ జాక్సన్‌ 2009 జూన్‌ 25న మృతి చెందాడు

views: 877

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams