Current Affairs Telugu Daily

‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ సవాల్‌కు ప్రధాని సుముఖత
ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను ప్రధాని నరేంద్రమోడి స్వీకరించారు.
  • భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విసరిన సవాలుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సవాలు స్వీకరించినవారు.. శారీరకంగా దృఢంగా ఉండేందుకు తాము ఎలాంటి వ్యాయామం చేస్తున్నామన్నది ఓ వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది.
  • తమ స్నేహితుల్లో మరికొంత మందికి తిరిగి ఇదే సవాలును విసరాల్సి ఉంటుంది.
  • కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ పేరుతో దీన్ని ప్రారంభించారు.
  • తాను దండీలు తీసిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. హిందీ సినీనటుడు హృతిక్‌ రోషన్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, విరాట్‌ కోహ్లిలకూ సవాలు విసిరారు.
  • కోహ్లి దీన్ని పూర్తి చేసి తన భార్య అనుష్కశర్మ, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ ధోని, మోదీలను సవాలులో చేరేందుకు ఆహ్వానించారు.
  • తాను సవాలును స్వీకరిస్తున్నానని.. త్వరలోనే వీడియోను పోస్ట్‌ చేస్తానని మోడి ట్వీట్‌ చేశారు. 

views: 778

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams