Current Affairs Telugu Daily

సినీ నిర్మాణ రంగంలోకి ఒబామా దంపతులు
సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్‌ నిర్మించి ప్రసారం చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌ ఒబామా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
  • ఒబామా దంపతులు నిర్మించే డాక్యుమెంటరీల్లో ముందస్తు స్క్రిప్టు రాసుకున్నవి, స్క్రిప్టు అవసరంలేని డాక్యుమెంటరీలు ఉంటాయని నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం ప్రకటించింది.
  • ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల అనుభవాలను కూడా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోనున్నారు.
  • నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఒబామా దంపతులు హయ్యర్‌ గ్రౌండ్‌ ప్రొడక్షన్స్‌ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు.
  • తమ నిర్మాణ సంస్థ ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించబోతున్నామని, వారి విలువైన అభిప్రాయాలను, అభిరుచులను తెలుసుకోవడంతోపాటు వాటిని ప్రపంచ ప్రజలతో పంచుకునేలా చేయడం కోసమే తాము ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒబామా తెలిపారు. వివిధ వర్గాల ప్రజల్లో నిగూఢంగా దాగున్న నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసి ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు.
  • బరాక్‌ ఒబామా 2009 జనవరి 20 నుంచి 2017 జనవరి 20 వరకు అమెరికా 44వ అధ్యక్షుడిగా పనిచేశారు

views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams