Current Affairs Telugu Daily

అంతర్జాతీయ క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్‌ వీడ్కోలు 
దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్‌ అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు 2018 మే 23న వీడియో సందేశం ద్వారా  ప్రకటించాడు. 2004లో ఇంగ్లాండ్‌పై టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డివిలియర్స్‌ చివరగా 2018 ఏప్రిల్‌ 3న ఆస్ట్రేలియాతో జొహానెస్‌బర్గ్‌లో తన చివరి టెస్టు ఆడాడు. అతను 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. అతను టెస్టులు, వన్డేలు రెండింట్లోనూ 50కి పైగా సగటుతో కెరీర్‌ను ముగించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20,014 పరుగులు చేశాడు. 
views: 898

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams