Current Affairs Telugu Daily

అనుమానాస్పద ఖాతాల నుంచి రూ. 6,146 కోట్ల వసూలు
పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత జమ చేసిన సొమ్ముకు వివరాలు చెప్పని వారి నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.6,416 కోట్లు పన్ను రూపంలో వసూలు చేసింది. 2016 నవంబరు 8న పెద్దనోట్లు రద్దయిన అనంతరం 3,04,000 మంది రూ.10 లక్షలు, అంతకన్నా అధికంగా జమ చేశారు. వారిలో 2.09 లక్షల మందికి చెందిన ఖాతాలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. వాటికీ స్పందన లేకపోవడంతో స్వీయ మదింపు పన్ను కింద రూ.6,416 కోట్లు వసూలు చేసింది. నోట్ల రద్దు సమయంలో రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జమ చేసిన వారి ఖాతాలను ఇకపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తనిఖీ చేయనుంది. 
views: 1193

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams