Current Affairs Telugu Daily

తెలంగాణలో CPS ఉద్యోగులకు గ్రాట్యుటీ 
తెలంగాణలో భాగస్వామ్య పింఛను పథకం(CPS) ఉద్యోగులకు పదవీ విరమణ, మరణానంతర గ్రాట్యుటీ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 23న ఉత్తర్వులు జారీ చేసింది. 2004 సెప్టెంబరు 1, ఆ తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీని అమలు కోసం తెలంగాణ పింఛను నిబంధనలు-1980 మార్పు తెస్తామని తెలిపింది. గ్రాట్యుటీకి మార్గదర్శకాలు, చెల్లింపు మొత్తాలపై మరో ఉత్తర్వును జారీ చేస్తామని పేర్కొంది.
  • CPS పరిధిలోకి వచ్చే ఉద్యోగులు గ్రాట్యుటీకి అనర్హులని 2004 సెప్టెంబరు 22న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు(జీవో నెం.653)ని జారీ చేసింది. అప్పటి నుంచి వారికి గ్రాట్యుటీ రావడం లేదు.
  • నాటినుంచే గ్రాట్యుటీ కోసం CPS ఉద్యోగులు ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నారు.
  • రాష్ట్రంలో 1.26 లక్షల మంది CPS ఉద్యోగులతోపాటు 998 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, మరణించిన 263 ఉద్యోగుల కుటుంబాలకు గ్రాట్యుటీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
  • సర్వీసు ఆధారంగా వారికి గ్రాట్యుటీ లభిస్తుంది.
  • ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.12 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.20 లక్షలు గ్రాట్యుటీ రూపేణా ఇస్తున్నారు. 
CPS- Contributory Pension Scheme

views: 868



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams