Current Affairs Telugu Daily

మాతా అమృతానందమయిపై అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్‌ వివాదాస్పద ట్వీట్లు
వివాదాస్పద అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్‌ భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై అసభ్య పదజాలంతో ట్వీట్లు చేశారు. ‘మాతా అమృతానందమయి మాకు కౌగిలింతలు కావాలి. ఇప్పటి వరకూ 32 మిలియన్ల కౌగిలింతలు ఇచ్చారు’ అంటూ ట్వీట్‌ చేశారు.
  • గత ఏడాదిగా ట్వీటర్‌కు దూరంగా ఉంటున్న కాన్యే ఇటీవల తన ఖాతాను రీఓపెన్‌ చేసి మాతా అమృతానందమయిపై ఈ విధంగా ట్వీట్‌ చేశారు.
  • గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.
  • కేరళకు చెందిన ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి తన వద్దకు వచ్చిన భక్తులకు కౌగిలింతల ద్వారా వారిని ఆశీర్వదిస్తారు.
  • దీనిపై మాతా అమృతానందమయి స్పందిస్తూ... తన వద్దకు వచ్చే భక్తులు చాలా విషాదంతో వస్తుంటారని, వారి సమస్యలతో తన వద్ద కన్నీరు పెట్టుకుంటారిని భక్తులను వారి సమస్యల నుంచి దారి మళ్లించుటకు తాను ప్రేమతో కౌగిలించుకుంటానని తెలిపారు. అదే  భక్తులకు తనపై ఉన్న నమ్మకంగా పేర్కొన్నారు. 

views: 913



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams