Current Affairs Telugu Daily

గుజరాత్‌ విద్యుత్‌ కేంద్రం వివాదంపై అమెరికా సుప్రీంకోర్టు  విచారణ
గుజరాత్‌లోని ఓ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన వివాదంపై విచారించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. ప్రపంచ బ్యాంకుకు చెందిన ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కచ్‌లోని టండా గ్రామంలో ఉన్న టాటా ముంద్రా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందంటూ ఆ గ్రామస్థులు ఈ పిటిషన్‌ వేశారు.
  • ఈ ప్రాజెక్టుకు ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.3,061 కోట్ల నిధులు అందించింది.
  • ఈ ప్రాజెక్టు స్థానిక పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందని ఆరోపిస్తూ టండా గ్రామస్థులు ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌పై అమెరికాలో కోర్టుకు ఎక్కారు.
  • మొదట వారు వేసిన పిటిషన్లను కింది కోర్టులు తిరస్కరించాయి. 1945-అంతర్జాతీయ సంస్థ మినహాయింపుల చట్టం కింద ఐఎఫ్‌సీకి రక్షణ ఉందని పేర్కొన్నాయి.
  • దీనిపై తాజాగా పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటు ఈ అంశంపై అక్టోబర్‌ ఆరంభంలో విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. చట్ట ప్రకారం ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు మినహాయింపు ఉందా లేదా అన్న విషయాన్ని తేల్చుతామని చెప్పింది.

views: 829

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams