Current Affairs Telugu Daily

10కి చేరిన నిపా వైరస్‌ మృతులు
కేరళలో ప్రాణాంతక నిపా వైరస్‌కు బలైనవారి సంఖ్య 10కి పెరిగింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ నిపా వైరస్‌ కలకలంపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది. గోరఖ్‌పూర్‌లో ఆక్సీజన్‌ సిలెండర్ల కొరతతో 30 మంది చిన్నారులు మరణించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ నిపా వైరస్‌ కట్టడికి కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఆసక్తి కనబరిచారు. ఆయన్ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆహ్వానించారు. నిపా వైరస్‌ సోకిన వారికి వైద్య చికిత్సలు అందించిన నర్సు లినీ పుతుస్సేరీ(28) కూడా మృతి చెందారు. 
views: 759

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams