Current Affairs Telugu Daily

వెనిజువెలా ఎన్నికల్లో మదురో విజయం
వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్‌ నేత నికోలస్‌ మదురో(55) విజయం సాధించారు. జాతీయ ఎన్నికల కౌన్సిల్‌ 2018 మే 20న ప్రకటించిన ఫలితాల్లో యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వెనిజువెలాకు చెందిన మదురో 68 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్‌ నమోదైన ఈ ఎన్నికల్లో మదురోకు 58 లక్షల ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్‌కు 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ విజయంతో మరో 6 సం॥ పాటు మదురో వెనిజువెలాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
  • వెనిజువెలాలో ఎన్నికలు జరిగిన తీరు సిగ్గుచేటనీ, ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)తో పాటు 17 పొరుగు దేశాలు తేల్చిచెప్పాయి. 

views: 938



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams