Current Affairs Telugu Daily

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం 
సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లే క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్‌ 2018 మే 21న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధికారులు తెలిపారు.
  • బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
  • ఈ అస్త్రం ‘జీవితకాల పొడిగింపు’నకు ఉద్దేశించిన కొన్ని పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
  • డీఆర్‌డీవో, బ్రహ్మోస్‌ బృందం తొలిసారిగా వీటిని భారత్‌లోనే అభివృద్ధి చేశాయి. దీనివల్ల భారత సైనిక దళాల్లో ఇప్పటికే మోహరించిన క్షిపణుల మార్పిడికి అయ్యే వ్యయం బాగా తగ్గుతుంది.
  • ఈ క్షిపణిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. రెండోది రామ్‌జెట్‌ ద్రవ ఇంధనంతో నడుస్తుంది.
  • ఈ అస్త్రం పొడవు 9 మీటర్లు కాగా.. బరువు 3 టన్నులు. దీన్ని నేల, నింగి, సముద్రం పైనుంచి, సాగరగర్భం నుంచి ప్రయోగించవచ్చు.
  • 290 కిలోమీటర్లుగా ఉన్న ఈ క్షిపణి పరిధిని గత ఏడాది 400 కిలోమీటర్లకు పెంచారు. 800 కిలోమీటర్లకు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.

views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams