భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) సాంకేతిక కమిటీ సభ్యుడిగా యూవీఎన్ బాబు నియమితులయ్యారు. హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన యూవీఎన్ బాబు రంగారెడ్డి బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారిగా సేవలు అందిస్తున్నాడు. భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపిచంద్ చేతుల మీదుగా యూవీఎన్ బాబు సాంకేతిక కమిటీ సభ్యుడిగా నియామక పత్రాన్ని అందుకున్నాడు.
యూవీఎన్తో పాటు రాష్ట్రానికి చెందిన సుధాకర్ వేమూరి, ఫణిరావు కూడా సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు.