Current Affairs Telugu Daily

వార్షిక జాతీయ ఆదాయం యొక్క తాత్కాలిక అంచనాలు, 2016-17 మరియు స్థూల దేశీయ ఉత్పత్తి యొక్క త్రైమాసిక అంచనాలు, 2016-17
కేంద్ర గణాంక సంస్థ  (సిఎస్ఓ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ, 2016-17 ఆర్థిక సంవత్సరానికి  జాతీయ ఆదాయం యొక్క తాత్కాలిక అంచనాలను  మరియు నాల్గవ త్రైమాసికానికి (జనవరి-మార్చి) స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) యొక్క త్రైమాసిక అంచనాలు 2016-17, రెండూ స్థిర  (2011-12) మరియు ప్రస్తుత ధరలు వద్ద విడుదల చేసింది.
    త్రైమాసిక జిడిపి అంచనాలను  పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) మరియు టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ల కొత్త సిరీస్ ను  ఉపయోగించి సంగ్రహించారు మే 12,2017న  CSO , ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (ఒఇఎ), ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ కొత్త ఐఐపి, డబ్ల్యుపిఐలను .2011-12 ఆధార సంవత్సరంగా విడుదల చేశారు.అదేవిధంగా జనవరి 31,2017 న 2011-12 నుండి 2015-16 మధ్యకాలానికి గాను విడుదల చేసిన  GDP వార్షిక అంచనాలను  IIP మరియు WPI ల క్రొత్త సీరీస్ నుపయోగించి సవరించింది.అవి క్రింది విధంగా ఉన్నాయి.     
(ప్రస్తుత ధరల వద్ద ( In Rs.crore)) (స్థిర ధరల వద్ద (In Rs. Crore))
సంవత్సరం   GDP GDP వృద్ధి రేటు (%) సంవత్సరం  GDP GDP వృద్ధి రేటు (%)
  పాత సీరీస్  కొత్త సీరీస్  పాత  కొత్త    పాత  కొత్త  పాత  కొత్త 
2011-12 8736039 8736329     2011-12 8736039 8736329    
2012-13 9946636 9944013 13.9 13.8 2012-13 9215125 9213017 5.5 5.5
2013-14 11236635 11233522 13.0 13.0 2013-14 9817822 9801370 6.5 6.4
2014-15 12433749 12445128 10.7 10.8 2014-15 10522686 10536984 7.2 7.5
2015-16 13675331 13682035 10.0 9.9 2015-16 11357529 11381002 7.9 8.0
జాతీయ ఆదాయం, 2016-17 యొక్క తాత్కాలిక అంచనాలు ః
        2016-17 సంవత్సరానికి జాతీయ ఆదాయం యొక్క రెండవ ముందస్తు అంచనాలు 2017 ఫిబ్రవరి 28 న విడుదలయ్యాయి.ఈ అంచనాలను ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి ,పారిశ్రామిక ఉత్పత్తి సూచి,రైల్వేలు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, భీమా మరియు ప్రభుత్వ వ్యయం,రవాణా వంటి కీలక రంగాల్లో పనితీరులను చేర్చుతూ తాజా అంచనాలను విడుదల చేసింది.
ఈ అంచనాల యొక్క విశేష లక్షణాలు
       (ఎ) ప్రస్తుత ధరల వద్ద అంచనాలు:
              స్థూల దేశీయ ఉత్పత్తిః   2016-17 సంవత్సరానికి ప్రస్తుత ధరలలో జిడిపి 84 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. 2015-2016 నాటికి 136.82 లక్షల కోట్ల రూపాయలు . జీడీపీ వృద్ధి రేటు 11.0 శాతంగా ఉంది.  
              ప్రస్తుత ధరల వద్ద 9.0 శాతం కంటే ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన రంగాలుః వ్యవసాయరంగం, 'తయారీ', వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ మరియు ప్రసారాలకు సంబంధించిన సేవలు, ఆర్థిక, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు,ప్రజా పరిపాలన, రక్షణ మరియు ఇతర సేవలు.
రంగాలవారీ విశ్లేషణ ః 
  (1) వ్యవసాయము ః
         'వ్యవసాయం, అటవీ మరియు ఫిషింగ్' రంగం ప్రస్తుత ధరలలో 9.0 శాతం వృద్ధి రేటును చూపించింది.ఈ రంగం యొక్క GVA అంచనాలు 2016-17 కొరకు ఆహార ధాన్యాల ఉత్పత్తి యొక్క మూడవ ముందస్తు  అంచనాలను ఉపయోగించి సంకలనం చేయబడ్డాయి.2016-17 లో  ఆహార ధాన్యాల ఉత్పత్తి మూడవసారి ముందస్తు అంచనా ప్రకారం  273.38 మిలియన్ టన్నులు.ఇది 2016-17 లో రెండవ ముందస్తు అంచనా అయిన  271.98 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంది.2015-16 వ్యవసాయ సంవత్సరంలో తుది అంచనాల ప్రకారం ఇది  251.57 మిలియన్ టన్నులుగా ఉంది.
 (2) మైనింగ్ మరియు క్వారీః
        ప్రస్తుత ధరల వద్ద  'మైనింగ్ అండ్ క్వారీ' సెక్టార్ 1.9 శాతం వృద్ధి రేటును చూపించింది.2016-17 లో మైనింగ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ  5.3 శాతంగా నమోదైనది.బొగ్గు, ముడి చమురు ఉత్పత్తులు వరుసగా 3.6  మరియు (-) 2.5 శాతం వృద్ధి రేటులను నమోదు చేశాయి.
 (3) తయారీః
       'తయారీ' రంగంలో వృద్ధి రేటు ప్రస్తుత ధరలలో 9.3 శాతంగా అంచనా వేయబడింది.ఈ రంగానికి సంబంధించి ప్రైవేటు కార్పోరేటు సెక్టార్ 12.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.తయారీ రంగంలో ఐఐపి 2016-17 లో  వృద్ధిరేటును 4.9 శాతంగా నమోదు చేసింది.
 (4) విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలుః
        విద్యుత్తు, గ్యాస్ , నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలు  2016-17  ప్రస్తుత ధరల వద్ద 6.5 శాతం పెరగనుంది.ఈ రంగం యొక్క ప్రధాన సూచిక, విద్యుత్ ఐఐపి, 2016-17 ఏప్రిల్- మార్చి లో 5.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.
  (5) నిర్మాణంః
        'నిర్మాణ రంగం' ప్రస్తుత ధరలలో 3.5 శాతం పెరగనుంది.నిర్మాణ  రంగానికి చెందిన ప్రధాన సూచికలు అయిన  సిమెంట్ ఉత్పత్తి మరియు వినియోగ ఉక్కు  2016-17 లో వరుసగా  (-) 1.3 శాతం మరియు 3.0 శాతం వృద్ధి రేటులను నమోదుచేశాయి.
 (6) ప్రసారం, వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్ మరియు సేవలుః
        ఈ రంగం ప్రస్తుత ధరలలో 9.8 శాతం పెరుగుతుందని అంచనా.2016-17 కాలంలో అమ్మకపు పన్ను వసూళ్లు 11.4 శాతం పెరుగుతుందని అంచనా.
  (7)ఆర్థిక, భీమా, రియల్ ఎస్టేట్ మరియు వృత్తిపరమైన సేవలుః
       ఈ రంగం 'ఆర్థిక, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు' ప్రస్తుత ధరలలో 9.8 శాతం వృద్ధి రేటును చూపించింది.ఈ పరిశ్రమలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ మరియు ప్రొఫెషనల్ సేవలు, ఇది 71.0 శాతం వాటా కలిగి ఉంది.బ్యాంకింగ్ యొక్క ప్రధాన సూచికలు, అనగా మొత్తం బ్యాంకు డిపాజిట్లు మరియు బ్యాంకు క్రెడిట్లు వరుసగా 11.8 శాతం మరియు 5.1 శాతం వృద్ధిని కనపరిచాయి.
    (8) ప్రజా పరిపాలన మరియు రక్షణ మరియు ఇతర సేవలుః
        ఈ  రంగం 'ప్రజా పరిపాలన, రక్షణ మరియు ఇతర సేవలు' ప్రస్తుత ధరలలో 16.6 శాతం వృద్ధి రేటును చూపించింది.ఈ రంగం యొక్క ముఖ్య సూచిక, కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల వడ్డీ చెల్లింపులు ఈ కాలంలో 18.3 శాతం పెరిగాయి.
  జాతీయ ఆదాయంః
      ప్రస్తుత ధరల వద్ద  2016-17 ఆర్థిక సంవత్సరానికి  జిఎన్ఐ రూ .149.94 లక్షల కోట్లు గా అంచనా వేసింది. 2015-16 లొ ఇది 135.22 లక్షల కోట్ల రూపాయలు.అంటే 10.9 శాతం పెరిగింది.   
తలసరి నికర జాతీయ ఆదాయంః
      2016-17 ఆర్ధిక సంవత్సరం నాటికి ప్రస్తుత ధరల వద్ద  తలసరి ఆదాయం రూ.1,03,219 స్థాయికి చేరుకున్నట్లు అంచనా వేయబడింది, ఇది 2015-16 సంవత్సరానికి రూ.94130 గా ఉంది .తలసరి ఆదాయంలో వృద్ధిరేటు  9.7 శాతం.
  (బి) స్థిర ధరల వద్ద అంచనాలుః
     స్థూల దేశీయ ఉత్పత్తిః
          2016-17 సంవత్సరానికి వాస్తవ  జిడిపి లేదా స్థిర ధరల వద్ద జిడిపి( 2011-12) 121.90 లక్షల కోట్ల రూపాయలుగా  అంచనా వేయబడింది. ఇది 2015-16 లో రూ.113.81 లక్షల కోట్లు .వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంది. 
ప్రాథమిక ధరలు వద్ద స్థూల విలువ చేర్పు(GVA)ః
          2016-17 సంవత్సరానికి ప్రాథమిక ధరల వద్ద  (2011-12) వాస్తవ GVA రూ.111.85 లక్షల కోట్లు గా అంచనా వేసింది. 2015-16 సంవత్సరానికి జి.వి.ఎ.రూ.104.91 లక్షల కోట్లు.వృద్ధి రేటు 6.6 శాతం.
        స్థిర ధరలలో 7.0 శాతం కంటే ఎక్కువ  వృద్ధిరేటు నమోదు చేసిన రంగాలు ప్రభుత్వ పరిపాలన, రక్షణ మరియు ఇతర సేవలు (11.3 శాతం), తయారీ (7.9 శాతం),వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచార ప్రసారం మరియు ప్రసారాలకు సంబంధించిన సేవలు '(7.8 శాతం),విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర వినియోగ సేవలు (7.2 శాతం),'వ్యవసాయం, అటవీ మరియు ఫిషింగ్', 'మైనింగ్ అండ్ క్వారీ', 'నిర్మాణం', 'ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్'లో వృద్ధి రేటు వరుసగా  4.9 శాతం,1.8 శాతం, 1.7 శాతం, 5.7 శాతం గా అంచనా వేయబడింది.
స్థూల జాతీయ ఆదాయంః
       2011-12 స్థిర ధరల వద్ద 2016-17 సంవత్సరానికి గాను స్థూల జాతీయ ఆదాయం 120.35 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది, అంతకుముందు సంవత్సరం రూ.112.46 లక్షల కోట్లు.వృద్ధి రేటుల ప్రకారం, 2016-17 నాటికి స్థూల జాతీయ ఆదాయం 7.0 శాతం పెరిగింది, 2015-16లో వృద్ధిరేటు 8.0 శాతంగా ఉంటుంది.
తలసరి ఆదాయంః
     2016-17 లో  తలసరి ఆదాయం (2011-12 ధరల ప్రకారం) 82,269 స్థాయికి చేరుకుంటుంది.  2015-16 సంవత్సరానికి 77,803 రూపాయల .

views: 1167



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams