Current Affairs Telugu Daily

60 మంది మహిళల కీర్తిని 43 నిమిషాల్లో వల్లెవేసి  తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు 
60 మంది మహిళల కీర్తిని 43 నిమిషాల్లో ఆంగ్లంలో చెప్పి విజయవాడకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి హాసిని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. విజయవాడకు చెందిన మున్నంగి ఉమాశంకర్‌, జ్యోతిల కుమార్తె హాసిని(8) రెండో తరగతి చదివి మూడో తరగతిలోకి ప్రవేశించింది.
  • చిన్నతనం నుంచి చెప్పిన ప్రతీ మాటను గుర్తు పెట్టుకుని తిరిగి చెప్పే హాసిని గ్రహణ శక్తిని గుర్తించిన తల్లిదండ్రులు క్లిష్టమైన పదాలను, దేశ రాజధానులు, ప్రపంచ వింతలు, వేగంగా గణిత సూత్రాలు చేయడం వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు. పాఠశాలో ప్రతీ పరీక్షలో నూరు శాతం మార్కులు సాధించేది.
  • జనరల్‌ నాలెడ్జ్‌, గణితంలో సంఖ్యలు, ఎక్కాలు, రసాయనశాస్త్రంలో 108 మూకాలు, వాటి విన్యాసాలు, భౌతిక శాస్త్ర ఫార్ములాలు... వంటి వాటిని గుర్తుపెట్టుకుని వరుసగా చెప్పి 2018 ఫిబ్రవరిలో ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో, మార్చిలో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో స్థానం సంపాదించింది.
  • ఈ సారి 60 మంది జాతీయ స్థాయిలో కీర్తి సాధించిన మహిళల చరిత్రను 60 నిమిషాల్లో ఆంగ్లంలో వల్లెవేసే పోటీని 2018 మే 20న విజయవాడలోని వాసవ్య మహిళా మండలిలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా హాసిని 43 నిమిషాల్లోనే ప్రదర్శన పూర్తి చేసి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో పేరు నమోదు చేసుకుంది.

views: 814

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams