Current Affairs Telugu Daily

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు వాహనం పేల్చిసిన మావోలు..ఆరుగురు పోలీసులు మృతి 
మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కిరండోల్‌ అటవీ ప్రాంతంలో 2018 మే 20న రహదారి పనుల గస్తీ విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రతా సిబ్బంది వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. కొంతకాలంగా బచేలి-చోల్నార్‌ రహదారి నిర్మాణం జరుగుతోంది. పనుల వద్ద గస్తీ విధులు నిర్వహించేందుకు ఆ జిల్లా పోలీస్‌, ఛత్తీస్‌గఢ్‌ ఏఆర్‌ బలగాలకు చెందిన ఏడుగురు  నిర్మాణ ప్రాంతానికి బొలెరో వాహనంలో బయల్దేరారు. ఆ సమాచారాన్ని పసిగట్టిన మావోయిస్టులు రహదారి వెంట వాగు సమీపంలో మాటువేశారు. ఓ వంతెన సమీపంలో అమర్చిన శక్తిమంతమైన మందుపాతర(ఐఈడీ)ని పేల్చారు. ఆ ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం వంద అడుగుల పైకి ఎగిరిపడి తునాతునకలై శకలాలు సమీపంలోని వాగులో ఎగిరిపడి ఆరుగురు పోలీసులు అక్కడిక్కడే మృతి చెందారు. 
views: 802Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams