Current Affairs Telugu Daily

కావేరీ ముసాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం
దక్షిణాది నాలుగు రాష్ట్రాల మధ్య సాఫీగా జలాల పంపిణీకి ఉద్దేశించి.. కేంద్ర ప్రభుత్వం  సమర్పించిన కావేరీ యాజమాన్య పథకం ముసాయిదాను సుప్రీంకోర్టు 2018 మే 18న ఆమోదించింది.
  • పథకంలో యోగ్యతకు సంబంధించి లోపాలు ఉన్నాయంటూ కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర నేతృత్వంలోని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
  • తాము మార్పులు చేసిన కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్‌ అవార్డును ఈ యాజమాన్య పథకం సహేతుక పరిష్కారానికి తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొంది.
  • కావేరీ పథకానికి తుది రూపు ఇవ్వనందుకు గాను కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం మోపాలన్న తమిళనాడు రాష్ట్ర విజ్ఞాపనను కూడా ధర్మాసనం కొట్టివేసింది.

views: 896

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams