Current Affairs Telugu Daily

జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీతో CII అవగాహన ఒప్పందం
వ్యవసాయంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత పరిశ్రమ సమాఖ్య (CII), ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య 2018 మే 18న అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి అవసరమైన శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల సహకారం వ్యవసాయ వర్సిటీ నుంచి తీసుకోవాలని CII నిర్ణయించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం సీఐఐతో నాలెడ్జ్‌ పార్టనర్‌గా వ్యవహరించనుంది. 
  • CII అధ్యక్షురాలు - శోభన కామినేని
  • CII ఏర్పాటు - 1895
CII-Confederation of Indian Industry

views: 873

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams