Current Affairs Telugu Daily

జస్టిస్‌ కర్ణన్‌ రాజకీయ పార్టీ ‘యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ’ 
2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కోల్‌కత హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ 2018 మే 16న దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ(ACDP) పేరుతో పార్టీని రిజిస్టర్‌ చేయించనున్నట్లు వెల్లడించారు.
  • ప్రధాని నరేంద్రమోడి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతానని కర్ణన్‌ తెలిపారు. వారణాసి మినహా మిగతా అన్ని స్థానాల నుంచి మహిళలు మాత్రమే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని కర్ణన్‌ ప్రకటించారు.
  • తమ పార్టీ తరపున ఎన్నిక పోటీలో పాల్గొనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయంగా లక్ష రూపాయలు అందిస్తామని తెలిపారు.
  • కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై 2017 మే 9న జస్టిస్‌ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్‌ నుంచి కోయంబత్తూరుకు పరారైన కర్ణన్‌ను 2017 జూన్‌ 20న సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 6 నెలల జైలు జీవితం అనంతరం 2017 డిసెంబరు 20న కర్ణన్‌ విడుదలయ్యారు.
  • పదవిలో ఉండగా అరెస్టయిన తొలి హైకోర్టు జడ్జిగా కర్ణన్‌ రికార్డులకెక్కారు. 
ACDP - Anti-Corruption Dynamic Party

views: 916

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams