Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ బీమాకు సంస్థల ఎంపిక 
ఖరీఫ్‌లో అమలయ్యే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంస్థలను ఎంపిక చేసింది. మొత్తం 14 బీమా సంస్థలు పోటీపడ్డాయి. బ్యాంకు నుంచి పంటరుణం తీసుకునే సమయంలో రైతు నుంచి ప్రీమియం మినహాయించుకుంటారు. రుణం పొందని రైతు రుణ అర్హత కార్డు, భూ యాజమాన్య హక్కు పత్రాలు, అనుభవదారు పత్రాల ఆధారంగా చెల్లించవచ్చు. 
  • వాతావరణ ఆధారిత బీమా
వాతావరణ ఆధారిత బీమా రెండు క్లస్టర్లలో సవరించిన పథకాన్ని అమలు చేస్తున్నారు. 
  1. అనంతపురం క్లస్టర్‌ - వ్యవసాయ బీమా సంస్థ 
  2. మిగిలిన 12 జిల్లాన్నీ మరో క్లస్టర్‌ - ఎస్‌బీఐ సాధారణ బీమా సంస్థ 
  • ప్రధానమంత్రి ఫసల్‌ బీమా
ఈ పథకం కింద రాష్ట్రాన్ని 4 క్లస్టర్లులుగా విభజించారు. 
  1. పశ్చిమ గోదావరి, అనంతపురం, కడప - హెచ్‌డీఎఫ్‌ సీ ఎర్గో బీమా సంస్థ 
  2. తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు - ఓరియంటల్‌ బీమా సంస్థ 
  3. కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం - వ్యవసాయ బీమా సంస్థ 
  4. శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం - జాతీయ బీమా సంస్థ

views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams