Current Affairs Telugu Daily

ఏపీలో 50 సం॥లు పైబడిన మత్స్యకారులకు రూ.1000 పింఛను 
పేద మత్స్యకారులకు ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 33,122 పింఛన్లు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 65 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు ఈ పథకం కింద చేయూతనిస్తుండగా తాజాగా 50 నుంచి 65 ఏళ్లలోపు వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే చేనేత, కల్లుగీత కార్మికులకు 50 ఏళ్ల నుంచి పింఛను ఇస్తున్న ప్రభుత్వం మత్స్యకారులకు సైతం వయసు సడలింపును ఇచ్చింది. అర్హులైన లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఇవ్వనుంది. 
views: 1338



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams