Current Affairs Telugu Daily

15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో సవరణలకు రాష్ట్రపతికి వినతి
రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో సవరణలు చేయాలని ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. 2018 మే 17న డిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పశ్చిమబంగ, పంజాబ్‌ ఆర్థిక మంత్రులు యనమల రామకృష్ణుడు, థామస్‌ ఇసాక్‌, అమిత్‌ మిత్రా, మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌లు రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి 6 పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. అందులో 12 సవరణలను వారు ప్రతిపాదించారు. తమ విజ్ఞప్తిపై కేంద్రం స్పందించకపోతే మున్ముందు మరింత ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. 
views: 824

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams