తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 1.572శాతం కరవు భత్యం పెంపు
తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు 1.572 శాతం కరవు భత్యం (డీఏ) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 17న ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2017 జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మూల వేతనంలో 24.104 శాతంగా ఉంది. తాజా పెరుగుదలతో అది 25.676 శాతానికి చేరింది.
views: 948