సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు నిక్కీ ఆసియా పురస్కారం
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డా॥ బిందేశ్వర్ పాఠక్‌కు నిక్కీ ఆసియా పురస్కారం లభించింది. 2018 జూన్ 13న టోక్యోలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించనున్నారు. ఆసియా అభివృద్ధిలో పాఠక్ చేసిన సేవలకు ఈ అవార్డు దక్కింది. ఆయనతో పాటూ మరో ఇద్దరు కూడా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 1970లో ఆయన స్థాపించిన సులభ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ పారిశుధ్యం, మానవహక్కులు తదితర రంగాల్లో సామాజిక సేవను అందచేస్తోంది. దేశవ్యాప్తంగా సులభ్ సంస్థ మరుగుదొడ్లను నిర్మించింది.
views: 1123