Current Affairs Telugu Daily

మే 31న వరల్డ్ నో టొబాకో డే
అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం. 31 మే వరల్డ్‌ నో టొబాకో డే పొగాకు నమలడం, పొగతాగడం ఎంత హానికరమోఅందరికీ తెలియజేయడం కోసం డబ్ల్యూహెచ్‌ఓ ఎంచుకున్న రోజు.డబ్ల్యూహెచ్‌ఓ చెబుతున్న తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్ల జనాభా 113 కోట్లకు పైనే ఉంది. వారిలో దాదాపు 95 కోట్ల మంది పురుషులే కాగా, సుమారు 18 కోట్ల మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగించే అంశం.
ముప్పయ్యేళ్ల కిందట అమెరికా జనాభాలో 42 శాతం మంది యథేచ్ఛగా పొగపీల్చేవారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రచార ఫలితంగా ఇప్పుడు ఆ సంఖ్య 20.8 శాతానికి తగ్గింది. ఇదే వ్యవధిలో భారత్‌లో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది.

views: 910

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams