మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌పై ప్రయాణ నిషేధం
మలేసియా ఎన్నికల్లో ఓటమి పాలై, ప్రధాని పదవిని కోల్పోయిన నజీబ్ రజాక్ ఎక్కడికీ వెళ్లరాదంటూ ఆయన ప్రయాణాలపై కొత్త ప్రభుత్వం నిషేధం విధించింది. వేల కోట్ల డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నజీబ్ ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకునేందుకు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ విభాగం ఈ ప్రకటన చేసింది. 92 ఏళ్ల వయసులో ప్రధాని పదవిని చేపట్టిన మహాథిర్ మహమ్మద్ దీన్ని ధ్రువీకరించారు.
views: 798