Current Affairs Telugu Daily

వడోదరవాసుల గిన్నిస్ రికార్డు
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల్లో పదోస్థానంలో నిలిచిన వడోదర నగవాసులు ఆదివారం గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అకోటా-దాండియా బజార్‌ను కలిపే వారధిని 5,058 మంది ప్రజలు కలిసి శుభ్రం చేసి ఈ రికార్డు సాధించారు. కిలోమీటర్ పొడవైన వంతెనను నగర ప్రజలు 50 బృందాలుగా విడిపోయి శుభ్రం చేశారని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినోద్‌రావ్ తెలి పారు. కార్యక్రమం అనంతరం గిన్నిస్ న్యాయనిర్ణేత ధ్రువపత్రాన్ని అందజేశారని పేర్కొన్నారు.
  • అకోటా-దాండియా బజార్‌ను కలిపే వారధిని 5,058 మంది ప్రజలు కలిసి శుభ్రం చేసి ఈ రికార్డు సాధించారు
  • వడోదరను  గతంలో బరోడా అని పిలిచేవారు , అహ్మదాబాద్ మరియు సూరత్ తరువాత గుజరాత్లోని పశ్చిమ భారతీయ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం. ఇది విశ్వమిత్ర నది ఒడ్డున ఉంది. 

views: 1087



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams