ఆసీస్ కొత్త కోచ్ జస్టిన్ లాంగర్ 2018 జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించే ఆస్ట్రేలియా వన్డే జట్టుకు టిమ్ పైన్‌ను కెప్టెన్‌గా నియమించాడు. ఆరోన్ ఫించ్‌కు టీ20 జట్టు బాధ్యతలు దక్కాయి. బాల్ టాంపరింగ్ కుంభకోణానికి సంబంధించి స్టీవ్ స్మిత్ ఏడాది నిషేధానికి గురైన నేపథ్యంలో ఆసీస్‌కు కొత్త కెప్టెన్ల నియామకం అవసరమైంది. ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2018 జూన్ 13న లార్డ్స్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరుగుతుంది.
views: 841