ఉత్తరప్రదేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యానికి ప్రతీకగా తమ హిందూ మిత్రుల కోసం ప్రత్యేకంగా శుభలేఖలు ముద్రించి తన స్నేహబాంధవ్యాన్ని చాటుకొంది. భాగ్సరాయ్ గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం 2018 ఏప్రిల్ 29న తన కుమార్తె జహనా బానోను యూసఫ్ మహమ్మద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ముస్లిం మిత్రుల కోసం సంప్రదాయ ఇస్లామిక్ శైలిలో శుభలేఖలు ముద్రించారు. హిందువుల కోసం కేండర్ తరహాలో పెళ్లి పత్రికలు అచ్చువేయించారు. వీటిపై సీతారాములు, కలశం, దివ్వెలు, అరటి ఆకులు, కొబ్బరికాయ, పూజా పళ్లెం వంటి చిత్రాలు ఉన్నాయి.
views: 852