Current Affairs Telugu Daily

భారత్‌లో 'జికా ' వైరస్ 
గుజరాత్ రాజధాని గాంధీనగర్ జంటనగరమైన అహ్మదాబాద్‌లో మూడు కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ధ్రువీకరించింది.
ముగ్గురిలో బాపూనగర్‌కు చెందిన ఒక గర్భవతి కూడా ఉన్నట్టు సంస్థ తెలిపింది. పగలు కుట్టే ఏడిస్ దోమల వల్ల వ్యాపించే ఈ వ్యాధి గర్భవతులకు వస్తే పిల్లలు లోపాలతో పుడుతారు. మెదడు ఎదుగుదల ప్రభావితమై తల చిన్నదిగా ఉండిపోతుంది. వైద్య పరిభాషలో దీన్ని మైక్రోసెఫాలి అంటారు. అంధత్వం, చెవుడు, మూర్ఛవ్యాధి కూడా రావచ్చు.
-ఇప్పటికే 25దేశాల్లో విస్తరించిన విష క్రిమి
-లాటిన్ అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్
-రెండేండ్లదాకా గర్భం దాల్చొద్దని హెచ్చరికలు
-వైరస్ సోకిన గర్భిణులకు చిన్న తలతో శిశువుల జననం
-జీవితాంతం వెంటాడే నాడీ సంబంధ వ్యాధులు
-జికాకు వ్యాక్సిన్ లేదు.. నివారణే పరిష్కారం
-మూలాలు ఉగాండాలో..
జికా వైరస్‌ అనేది ఒక ఫ్లేవి వైరస్‌. అంటే.. ఎల్లో ఫీవర్‌, వెస్ట్‌నైల్‌, చికున్‌గున్యా, డెంగీ తదితర వ్యాధులను కలిగించే వైర్‌సల కుటుంబానికి చెందినది. ఈ వైర్‌సను తొలిసారి 1947లో ఉగాండాలోని జికా అటవీ ప్రాంతంలో ఉండే కోతుల్లో కనుగొన్నారు. అందుకే దీనికి ఆ పేరుపెట్టారు. ఇది ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతమైన ఆఫ్రికా నుంచి ప్రారంభమై.. ఆగ్నేయాసియా, పసిఫిక్‌ ఐ లాండ్స్‌ మీదుగా దక్షిణ అమెరికా దేశాలకు దోమల ద్వారా వ్యాపించింది. 2014 తరువాత ఈ వైరస్‌.. బ్రెజిల్‌లో పెద్దఎత్తున వ్యాపించడం మొదలై.. ఆపై పలుదేశాలకు విస్తరించింది.

views: 1266

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams