జాతీయ పారిశ్రామిక భద్రతాదళం శిక్షణా కేంద్రం (నీసా) సంచాలకులుగా అంజనాసిన్హా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమె ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో పని చేస్తున్నారు. డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకు వెళ్లిన ఆమె నీసా సంచాలకులుగా నియమితులయ్యారు.
జాతీయ పారిశ్రామిక భద్రతా దళం (CISF) బలగాలకు నీసాలో శిక్షణ ఇస్తుంటారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఈ కేంద్రం ఉంది. CISF బలగాలకు శిక్షణ ఇచ్చే కేంద్రం దేశం మొత్తం మీద ఇదొక్కటే.
నీసాకు ఒక మహిళా అధికారి బాధ్యతలు చేపట్టడం కూడా ఇదే ప్రథమం.
NISA-National Industrial Security Academy
CISF-Central Industrial Security Force
views: 882