నెయ్మార్ జూనియర్ ఫైవ్ ఫుట్‌బాల్ టోర్నీ విజేత ముంబయి
నెయ్మార్ జూనియర్ ఫైవ్ ఫుట్‌బాల్ టోర్నీలో జాగో బొనిటో ముంబయి జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్‌లో 2018 ఏప్రిల్ 29న నిర్వహించిన ఫైనల్లో ముంబయి కలింగ రేంజర్స్ ఎఫ్‌సీ పుణేపై విజయం సాధించింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 14 నగరాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.
విజేతగా నిలిచిన ముంబయి బ్రెజిల్లో జరిగే ప్రపంచ ఫైనల్ టోర్నీకి అర్హత సాధించడంతో పాటు నెయ్‌మార్‌ను కలిసే అవకాశాన్ని గెలుచుకుంది.