Current Affairs Telugu Daily

ప్రధాని నరేంద్రమోడి ‘మన్‌ కీ బాత్‌’ 
ప్రధాని నరేంద్రమోడి 2018 ఏప్రిల్‌ 29న  మన్‌ కీ బాత్‌(మనసులో మాట) కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్‌లో విద్యార్థులు మమేకం కావాలని మోడి పిలుపునిచ్చారు.
  • వేసవి సెలవుల్లో మూడు మంత్రిత్వ శాఖలు కలిసి ప్రత్యేకంగా చేపట్టిన ‘ఇంటర్న్‌షిప్‌’ కార్యక్రమంలో పాలు పంచుకుని, దానివల్ల కలిగే ప్రయోజనాలను పొందాలని సూచించారు. సమాజంలో మార్పును కోరుకునేవారికి ఇదొక మంచి అవకాశమన్నారు. కార్యక్రమంలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులను జాతీయస్థాయిలో గుర్తిస్తామని ప్రకటించారు. ఇచ్చిన లక్ష్యాలను చక్కగా పూర్తిచేసిన వారికి యూజీసీ రెండు క్రెడిట్‌ పాయింట్లను అందిస్తుందని చెప్పారు.
  • 1998 మే 11న బుద్ధపౌర్ణమి రోజే భారతదేశం అణుపరీక్షల్ని నిర్వహించిందని ప్రధాని గుర్తు చేస్తూ ‘జై విజ్ఞాన్‌’ అనేది అప్పుడు ప్రధానిగా ఉన్న ఏబీ వాజ్‌పేయి చెప్పిన మాట అని, దానిని యువత ఆచరించాలని సూచించారు.
  • కామన్వెల్త్‌ క్రీడల్లో మంచి పనితీరు కనపరిచిన క్రీడా బృందం, ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులను ప్రధాని అభినందించారు.  
  • జాతీయ ఉపాధి హామీ పథకానికి అదనంగా ఏటా రూ.32,000 కోట్లు ఖర్చు చేయడం ద్వారా మూడేళ్లలో 159 లక్షల ఎకరాల  భూముల్ని సాగులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
  • తాను ఇచ్చిన ‘ఫిట్‌ ఇండియా’ పిలుపునకు యువత పెద్దఎత్తున స్పందన లభించడం పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. 
  •  ‘మన్‌ కీ బాత్‌’ ప్రారంభం - 2014  అక్టోబర్ 3

views: 852



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams