Current Affairs Telugu Daily

ముంబయి బాంబు పేలుళ్ల కేసులో చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ తొలగింగిన పాక్‌
ముంబయి తీవ్రవాద దాడి కేసు విచారణ నుంచి చీఫ్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న చౌధ్రీ అజహర్‌ను పాకిస్థాన్‌ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ హఠాత్తుగా తప్పించేసింది. పాక్‌ ప్రభుత్వం కోరుకున్న తీరులో వ్యవహరించడం లేదన్న ఆరోపణతో చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ను తొలగించేశారు. 2008 నవంబరులో ముంబయిలో దాడులు చెలరేగి 166 మంది మరణించారు. ఈ ఘాతుకానికి పాల్పడేందుకు పది మంది లష్కరే తొయిబా తీవ్రవాదులు కరాచీ నుంచి పనిగట్టుకుని ముంబయికి సముద్రమార్గాన వచ్చి చేరారు. పాక్‌ ప్రభుత్వం ఈ కేసు విషయంలో అనుసరిస్తున్న తీరు పట్ల 2009 నుంచీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న అజహర్‌కు, ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. పర్యవసానంగా ఆయనను ఈ కేసునుంచి పాక్‌ ప్రభుత్వం తప్పించేసింది.
  • 2008 నవంబరు  26  నుండి 29 వరకు మూడు రోజు పాటు దారుణ మారణకాండ కొనసాగింది. 

views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams