Current Affairs Telugu Daily

పెషావర్‌ జైలు నుంచి పాక్‌ వైద్యుడు ఆఫ్రిది తరలింపు 
ఒసామా బిన్‌ లాడెన్‌ను తుద ముట్టించడంలో అమెరికాకు సహకరించిన వైద్యుడు షేక్‌ అఫ్రిదిని పాకిస్థాన్‌ ప్రభుత్వం జైలు నుంచి సురక్షితమైన గుర్తుతెలియని మరో నగరానికి తరలించింది.
  • అబోటాబాద్‌లో నకిలీ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించి ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధ్యక్షుడు లాడెన్‌ ఆవాసాన్ని గుర్తించి ఆ సమాచారాన్ని అఫ్రిది అమెరికా కేంద్ర నిఘా సంస్థకు అందించారు. తద్వారా అమెరికా లాడెన్‌ను అంతమొందించింది.
  • ఈ నేపథ్యంలో జాతి వ్యతిరేక చర్యకు పాల్పడ్డారంటూ అఫ్రిదికి న్యాయస్థానం 33 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
  • ఈ క్రమంలో ఆయన పెషావర్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే జైలులో తెహ్రిక్‌ ఏ తాలిబన్‌ పాకిస్థాన్‌ తీవ్రవాదులు శిక్ష అనుభవిస్తున్నారు. వారి నుంచి అఫ్రిది ప్రాణాలకు ముప్పుందని రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. దీంతో 2018 ఏప్రిల్‌ 27న అఫ్రిదిని మరో ప్రాంతానికి తరలించారు. 

views: 829



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams