Current Affairs Telugu Daily

పుదుచ్చేరి లో చెత్త తొలగిస్తేనే ఉచిత బియ్యం
నియోజకవర్గాల్లో పేరుకుపోయిన చెత్తను 4 వారాల్లోపు తొలగిస్తేనే ఉచిత బియ్యం పంపిణీ ఉంటుందని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ కొత్త నిబంధన విధించారు. దీనిపై ఆమె ప్రభుత్వ కార్యదర్శులు, ఎమ్మెల్యేలకు 2018 ఏప్రిల్ 28 న ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించిందని, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు దీని గురించి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
  • పుదుచ్చేరి రాజధాని - పాండిచ్చేరి 
  • పుదుచ్చేరి ముఖ్యమంత్రి  - వి. నారాయణ స్వామి 

views: 855



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams