Current Affairs Telugu Daily

భారత్‌లో తగ్గుతోన్న మత స్వేచ్ఛ : అమెరికా ప్రభుత్వ కమిషన్‌ 
భారత్‌లో మత స్వేచ్ఛ వాతావరణం 2017లో మరింత దిగజారిందని అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్‌ అభిప్రాయపడింది. అన్య మతస్థులు, దళితులపై హింసకు పాల్పడటం ద్వారా హిందూ జాతీయవాద సంస్థలు కాషాయీకరణకు దిగాయని తాజా నివేదికలో ఆరోపించింది. మత స్వేచ్ఛకు సంబంధించి.. అఫ్గానిస్థాన్‌, అజర్బైజాన్‌, ఇరాక్‌ తదితర దేశాలున్న రెండో శ్రేణి దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్ పరివార్‌, వీహెచ్‌పీ వంటి హిందూ జాతీయవాద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు వల్ల దశాబ్ద కాలంగా మైనార్టీల పరిస్థితి హీనంగా మారుతూ వస్తోందని ఆరోపించింది. దేశంలోని మూడింట రెండొంతుల రాష్ట్రాలు మత మార్పిడి, గోవధ వంటి వాటికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ప్రయోగించాయని వెల్లడించింది. గో రక్షక బృందాల దాడుల్లో 2017లో కనీసం పది మంది మరణించారని.. మతం మార్చుకున్నవారిని బలవంతంగా తిరిగి హిందూమతంలో చేర్చుకునే కార్యక్రమాలు జరిగాయని తెలిపింది.
views: 818



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams