Current Affairs Telugu Daily

రేణుకాచౌదరి వ్యాఖ్యలపై శివసేన ధ్వజం
క్యాస్టింగ్‌ కౌచ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకాచౌదరి వైఖరిపై శివసేన విరుచుకుపడింది. ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసినప్పుడు చేయని వ్యాఖ్యలు, రాజ్యసభ సభ్యురాలిగా పదవీకాలం ముగిసిన తరువాత చేయడమేమిటని ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా, మహిళలను కించపరిచేవిగా ఉన్నాయంది. ఈ విషయాన్ని మోడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు తన పత్రిక ‘సామ్నా’లో సంపాదకీయం రాసింది. క్యాస్టింగ్‌ కౌచ్‌కు పార్లమెంటు సైతం అతీతం కాదని, సినీ పరిశ్రమతో పాటు అన్ని పనిప్రదేశాల్లో ఉందనేది చేదునిజమని రేణుకాచౌదరి ఇటీవల వ్యాఖ్యానించింది. 
views: 774

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams