Current Affairs Telugu Daily

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు
పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులపై నమోదయ్యే క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ 2018 ఏప్రిల్‌ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స్‌ జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయనున్నారు.
  • ఫాస్ట్‌ కోర్టుకు సంబంధించిన ఆదేశాలను న్యాయశాఖ ఈ ఏడాది ఇప్పటికే వెలువరించినప్పటికీ అందులో రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించలేదు.
  • తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ సెషన్స్‌ జడ్డి నేతృత్వంలో నిర్వహించే ప్రత్యేక న్యాయస్థానం కిందకు వస్తాయని పేర్కొన్నారు.
  • 2016లో దాఖలైన ఓ రిట్‌ పిటిషన్‌ పై తీర్పు సందర్భంగా ప్రతి రాష్ట్రం లోనూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే క్రిమినల్‌ కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసారు 

views: 951

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams