Current Affairs Telugu Daily

ఛాంపియన్స్‌ ట్రోఫీ స్థానంలో టీ20
ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయిన ఛాంపియన్స్‌ ట్రోఫీని ఐసీసీ రద్దు చేసింది. 2021లో భారత్‌లో జరగాల్సి ఉన్న ఈ టోర్నీ స్థానంలో ప్రపంచ టీ20ని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో వరుసగా రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. 2020లో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యమివ్వాల్సివుంది.
  • 2021లో భారత్‌ ఆతిథ్యమివ్వాల్సి ఉన్న ఛాంపియన్స్‌ ట్రోఫీ స్థానంలో ప్రపంచ టీ20 జరగనుంది. 2009, 2010లో కూడా ఇలానే రెండు టీ20 కప్‌లు వరుసగా ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ల్లో జరిగాయి.
  • క్రికెట్‌ను ప్రపంచమంతా విస్తరించేందుకు మొత్తం 104 సభ్య దేశాలకూ టీ20 హోదా ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిర్ణయించింది.
  • అన్ని దేశాల మహిళల జట్లకు 2018 జులై 1న, పురుషుల జట్లకు 2019 జనవరి 1న టీ20 హోదా ఇస్తారు.

views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams