Current Affairs Telugu Daily

దసలి పట్టుపై విదేశీ శాస్త్రవేత్తల అధ్యయనం 
మారుమూల ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న దసలి పట్టు వస్త్రాలు, రైతుల జీవన స్థితిగతులపై విదేశీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండల కేంద్రంలో చైనా, స్వీడన్‌, థాయ్‌లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2018 ఏప్రిల్‌ 25న పర్యటించారు. పట్టు పురుగుల ద్వారా దసలి పట్టు దారాన్ని తీయడం, వస్త్రాలు తయారు చేయడాన్ని వారు పరిశీలించారు. యంత్రాల వినియోగం లేకుండా మరమగ్గాల సహాయంతోనే వస్త్రాలను తయారు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి దసలి పట్టు రైతు కుటుంబాల జీవన పరిస్థితులపై ఆరా తీశారు. వారి వెంట సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు శాస్త్రవేత్త డా.పొన్నవెల్‌, కాకతీయ యూనివర్సటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.శమిత తదితరులు ఉన్నారు.
views: 814

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams