Current Affairs Telugu Daily

LICకి రెండు, నాలుగో శనివారాలు సెలవు
ప్రభుత్వరంగ బ్యాంకు తరహాలోనే జీవిత బీమా సంస్థ(LIC) ఉద్యోగులకు కూడా ఇకనుంచి ప్రతి రెండు, నాలుగో శనివారం సెలవు ఉంటుంది. ఈ తరహా సెలవు కోసం LIC సిబ్బంది ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌కు ప్రభుత్వం కొన్ని మార్పులు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.
  • LIC ఛైర్మన్‌ - వి.కె.శర్మ
  • LIC ప్రధాన కార్యాలయం - ముంబై
  • LIC ఏర్పాటు - 1956 సెప్టెంబర్‌ 1
LIC-Life Insurance Corporation

views: 837



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams