Current Affairs Telugu Daily

మహబూబాబాద్‌ జిల్లాలో కాకతీయుల కాలం నాటి మరో శాసనం 
కాకతీయుల కాలం నాటి ఓ శాసనం తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుడితండాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వెలుగుచూసింది. పాకాల చెరువుకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ శాసనం ఉంది.
  • ఇందులో కాకతీయుల రాజైన గణపతిదేవుని బిరుదు ‘రాజగజకేసరి’, ‘రాయగజకేసరి’గా లిఖించి ఉంది.
  • ఈ శాసనాన్ని ఎంఏ ఆర్కియాలజీ చేస్తున్న అరవింద్‌ అనే విద్యార్థి కనుగొనగా, దీన్ని పూర్తిగా చదివి ఇది కాకతీయుల కాలం నాటిదేనని చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్‌ నిర్ధరించారు.
  • గ్రామస్థులు ఈ ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు. కానీ, శాసనంలో ఈ ఆలయం పేరు రామనాథ దేవాలయంగా లిఖించి ఉంది. గర్భగుడిలోని మూలమూర్తి పేరు ‘రామనాథ దేవర’ అని కూడా ఇందులో పేర్కొన్నారు.
  • శాసనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కాచబోయడు, మల్లెబోయడు అనే ఇద్దరు వ్యక్తులు ఆలయ కైంకర్య సేవ కోసం నెయ్యిని దానం ఇచ్చినట్టు ఈ శాసనంలో ఉంది.
  • ఆలయ స్తంభానికి ఉన్న ఈ శాసనంపై రంగు వేయడంతో ఇది సాధారణ బండరాయిలాగానే ఉంది. కొన్ని రసాయనాలు ఉపయోగిస్తే దీనిపై ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపించాయని శాసనాన్ని కనుగొన్న అరవింద్‌ తెలిపారు.

views: 889

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams