Current Affairs Telugu Daily

సైనిక పాఠశాలలో తొలిసారి విద్యార్థినులకు ప్రవేశం
సైనిక పాఠశాలలు ప్రారంభమైన 57 సంవత్సరాల తర్వాత తొలిసారి సైనిక పాఠశాల్లో ఆడ పిల్లలకు అవకాశం కల్పించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 2018-2019 విద్యాసంవత్సరానికి గాను లక్నోలోని కెప్టెన్‌ మనోజ్‌ కుమార్‌ పాండే సైనిక పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పించారు. వీరందరూ రైతులు, వైద్యులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు వంటి వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు. సైనిక పాఠశాలలో ప్రవేశం పొందడానికి మొత్తం 2500 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్ష, ఇంటర్యూ తర్వాత 15 మంది విద్యార్థినులను ఎంపిక చేసారు.
views: 827Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams